కాంగ్రెస్ చూపు… సేవాలాల్ రాథోడ్ వైపు..
•అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రెసులో శివ రాథోడ్ ముందంజ
•అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపెడ్తా
• వైద్యం , రోడ్లు , విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం
• పలు సమస్యలపై శివ రాథోడ్ ద్రుష్టి
•మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి గుర్తించిన కాంగ్రెస్
• అవకాశం ఇస్తే అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం .
• యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ రాథోడ్
అదిలాబాద్, అక్షిత ప్రతినిధి :
ఆదిలాబాద్ జిల్లా ( ఎస్టీ ) యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ రాథోడ్ , ఎంపీ అభ్యర్ధిగా దరఖాస్తు చేసుకొన్నారు . ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన భారత్ జోడో యాత్రతో పాటు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలను అదిలాబాద్ జిల్లా లోప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు . అదేవిధంగా కెసిఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిపై ప్రజలకు ఏ విధంగా తెలియజేశారు . ముక్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వైద్యం , రోడ్లు , విద్యుత్ , సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో అదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలను బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది ..
అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రెసులో శివ రాథోడ్ ముందంజ
అదిలాబాద్ ( ఎస్టీ ) నుండి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ రాథోద్ , ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బాగా పట్టు బిగించారు . కింద స్థాయి నుండి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థాయికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని శివ రాథోడ్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది . అదేవిధంగా ఎంపీగా అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న తమ పేరును పరిశీలనలో ముందంజలో ఉన్నట్లు సమాచారం .
అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపెడ్తా
కాంగ్రెస్ అధినాయకత్వం తన పేరును పరిశీలించి టికెట్ కేటాయిస్తే .. అదిలాబాద్ అసెంబ్లీ లో బిజెపి బిఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని శివ రాథోడ్ అంటున్నారు . ఈ బిజెపి బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , వాటిని ప్రజల నుండి విముక్తి చెందాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆయన భావిస్తున్నారు . తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే .. అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరావేయడం ఖాయంగా కానుపిస్తుంది . అదిలాబాద్ జిల్లా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎంటో చేసి చూపెడ్తానని ఆయన చెప్పుకొస్తున్నారట .
వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య , సమస్యలు పరిష్కారించడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో బిఆర్ఎస్ ప్రభుత్వం వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య సమస్యలను గాలికి వదిలిందని ప్రధానంగా ఈ నాలుగు సమస్యలే ఎక్కువ ఉన్నట్లు శివ రాథోడ్ ద్రుష్టికి వచ్చిన ఆయన తో అన్నారు . వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య , సమస్యలు పరిష్కారించడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం అయిందని శివ రాథోడ్ మండిపడ్డారు .ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగు సమస్యలే చాలా వున్నట్లు ఆయన వాపోయారు . రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ బిజెపి బిఆర్ఎస్ ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆయన తెలిపారు .
మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి గుర్తించిన కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి గుర్తించడం
చాలా గర్వాంగా ఉందని శివ రాథోడ్ పేర్కొన్నారు . సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంకు చెందిన శివ రాథోడ్ , కు రాష్ట్ర స్థాయి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు . ఇలాంటి అవకాశాలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు . అదేవిధంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జిగా నియమితులు అయ్యారు . ముక్యంగా ( ఎస్టీ ) రిజర్వడ్ వున్నా అదిలాబాద్ జిల్లా పై ప్రత్యేక ద్రుష్టి సారించారు . ఈ సందర్భంగా గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్న పోడు పట్టాలు , అర్హులందరికీ ఇవ్వకపోవడం ధరణితో బీదా గిరిజనుల భూమిని లక్కోవడం సమస్య ఎక్కువగానే ఉన్నట్లు ఆయన ఆగ్రహం చెందారు .
అవకాశం ఇస్తే అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
కాంగ్రెస్ అధిష్టానం తమకు ఎంపీ టికెట్ ఇస్తే అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమాగా వున్నారు . కాంగ్రెస్ నాయకులందరికి ఆశీస్సులు తమపైనే ఉందని 100 % శాతం నమ్మకం ఉందన్నారు .