పీవీకి భారత రత్న ప్రకటించడం పట్ల హర్షం భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న అవార్డు ప్రకటించడం పట్ల మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన మహా నాయకుడని ఆయన కొనియాడారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెల్లిందని, నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆ మహానుభావుడు తెలంగాణ వాడు కావడం మనందరికీ గర్వకారణం
అన్నారు.

ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి?
అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు అన్నారు. అంత గొప్ప వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ను గౌరవించి భారత రత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి భాస్కర్ రావు ధన్యవాదాలు తెలిపారు.