ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో బడ్జెట్ల రూపకల్పన
-అఖిల భారత విద్యా
హక్కు వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్
-ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైన
టిపిటిఎఫ్ రాష్ట్ర ద్యితీయ మహాసభలు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
విద్య బ్రాహ్మణీయ లక్షణాలను పుణికి పుచ్చుకున్న మన విద్యారంగాన్ని ఇప్పటి పాలకులు కూడా కొనసాగిస్తూ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని మహాసభల ముఖ్య అతిథి అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ అన్నారు.ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన తెలంగాణ ప్రోగ్రేసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) ద్వితీయ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఉపాధ్యాయునికి ప్రత్యమ్నాయం లేదని తరగతో గది అభ్యసనల్లో ఉపాధ్యాయుడే అంతిమ విధాన నిర్ణయకర్త అని ఆయన పిలుపునిచ్చారు.

మౌలిక సదుపాయాలు వుండ వచ్చును కానీ వాటిని సాకుగా చూపో ఉపాధ్యాయుల సంకల్పబలం మాత్రమే విద్యలో అభివృద్ధి సాధించగవమని ఆయన అన్నారు.నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నేల పై అన్ని వర్గాల పేదలకు సమాన విద్య అందించటంలో నిరంతరం పోరాటంలో మనం ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో అభ్యదయ శాస్త్రీయ ఆలోచనా విధానాలను పెంపొందించాలని ఆయన సూచించారు.రేపటి తరాలకు నూతన ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా మన బోధనలను అప్ డేట్ చేసుకోవాలన్నారు. ఎంతటి ఆధునిక సాంకేతిక విజ్ఞానమైనా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదని ఆయన అన్నారు. విజ్ఞాన శాస్త్రం పై విద్యార్థులకు అభ్యసనాసక్తి పెంపొందించాలని ఈ దిశగా మన పాఠశాలలను ముందుకు నడిపించాలని కోరారు. పాఠశాలలను ప్రయోగశాలలుగా మారుస్తూ కాలం చెల్లిన విద్యా విధానాలను కొనసాగించటం నష్టదాయకమని అన్నారు. పిఎం శ్రీ పథకం కింద కేవలం 1500 పాఠశాలలను ఎంపిక చేసి రైజింగ్ ఇండియ పేరిట పక్కదారి పట్టించారన్నారు. కుల మతాంతరాలు లేని జండర్ సమానత్వం బోధించే విద్య కోసం కృషి చేయాలన్నారు. పేద వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందేలా చూడాలన్నారు.ప్రతి పిల్లవాడికి తల్లి తొలి గురువు కావటం అవసరమని పిల్లవాడిలో చదవటం ఒక అలవాటుగా పెంపొందించేందుకు అవకాశమున్న మేరకు గ్రంధాలయాల ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకోసం జరిగే అన్ని రకాల విద్యా వంతుల ఉపాధ్యాయుల పోరాటాలకు అఖిల భారత విద్యా హక్కు వేదిక వెన్నుదన్నుగా వుంటుందని అన్నారు.
అంతరాలు లేని విద్య అందరికీ విద్య అనే నినాదంతో నూతన సమాజంకోసం తెలంగాణ ప్రోగ్రేసివ్ టీచర్స్ ఫెడరేషన్ నిరంతర పోరాటాల పథాన నడుస్తుందని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వైఅశోక్ కుమార్ అన్నారు.మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,75,891 కోట్ల బడ్జెట్ లో విద్య కు రూ.21,389 కోట్లు కేటాయించారు. అది కేవలం బడ్జెట్ లో 7.75% గత సంవత్సరం కేటాయింపుల కన్నా కొంత మెరుగైనా నామ మాత్రంగానే కేటాయించారు.2022-23 లో విద్య కు కేటాయింపులు రూ.16,043 కోట్లు అయితే మొత్తం బడ్జెట్ రూ.2,45,257 కోట్లు (6.5% శాతం) కాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 15% గా హామీ ఇచ్చారు. కానీ అందులో సగం మాత్రమే కేటాయించారు26 వేల ప్రభుత్వ
పాఠశాలల్లో మౌలిక వసతుల ప్రస్తావన లేకుండా రాబోయే ఇంటర్నేషనల్ స్కూళ్లకు రూ.500 కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు.విశ్వ విద్యాలయాల అభివృద్ధి కోసం రూ.3000 కోట్లు కోరగా కేవలం రూ. 500 కోట్లు కేటాయించడంతో ఈ ప్రభుత్వం కూడా గత సర్కార్ కన్న మెరుగుగా ఆచరణ లేదు. ఆర్థిక అవరోధాలు అధిగమించి రాబోయే కాలంలో ఇచ్చిన హామీల మేరకు విద్యారంగం కోసం కనీసం 15% కేటాయిస్తారని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గా ఆశిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలుగా మారిన 317 జీవో కామన్ సర్వీస్ రూల్స్ టెంపరరౌ కాంట్రాక్ట్ తదితర వెట్టిచాకిరీ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయ ఖాళీల నియమాకాలకు నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.వేర్వేరు మేనేజ్ మెంట్ల లో కులాల వారిగా వేర్వేరు పాలనా విధానాలతో నడుస్తున్న గురుకులాల్లో విద్యా విలువలను కాపాడాలని ఆయన కోరారు.విద్యను ప్రాధాన్యతా రంగంగా గుర్తించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు సామాజిక సమస్యలపై రాజీ లేని పోరాటాలకు భావస్వారూప్యం వున్న ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉమ్మడి వేదికలపై నుండి ఉపాధ్యాయులను చైతన్యపరచేందుకు టిపిటిఎఫ్ కృషిచేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రసాధనా పోరాటం ఆర్టిసి సమ్మె కోవిడ్ నిరోధానికి ప్రజలను చైతన్యపరిచే క్రమంలో టిపిటిఎఫ్ ఉపాధ్యాయులు చైతన్యశీల పోరాటాలలో పాల్గొన్నారని అశోక్ కుమార్ తెలిపారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా పేదలకు అందే సమాన విద్య ను దూరం చేసే విధంగా ముందు కొచ్చిన నూతన విద్యా విధానం 2020 కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.రాజ్యాంగ విలువలను కాలరాసేందుకు ముందుకొచ్చిన నూతన విద్యా ముసాయిదా 2020 ని వ్యతిరేకించాలని ఏపిటిఎఫ్ పూర్వ అధ్యక్షులు కె. వేణుగోపాల్ కోరారు. నిర్ధుష్టమైన వ్యవస్థను ప్రతిపాదించని ఎన్ ఓపి 2020 కొఠారీ కమీషన్ సిఫార్సులను ఖాతరు చేయకుండా ప్రత్యమ్నాయ బ్రాహ్మణీయ సాంప్రదాయ విధానాలను ప్రతిపాదించిందని అన్నారు.గత ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలను ముందుకు తీసుకు వెళ్ళాలని ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులు రాములు సూచించారు.ఈ మహాసభల్లో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి మనోహర్ రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు.