వరంగల్ టిక్కెట్
డా.జెఎస్ పరంజ్యోతిదే ?
అధిష్టానం మదిలో …
డా.జెఎస్ పరంజ్యోతి
వరంగల్ ఎంపి రేసులో కాంగ్రెస్ అభ్యర్థిగా పరిశీలన
జయశంకర్ సర్ శిష్యరికం
విద్యావేత్త..దళితజాతి ఆశాకిరణం డా.జెఎస్ పరంజ్యోతికి పెద్దల అండ
వరంగల్, అక్షిత బ్యూరో :
విద్యావేత్త…సామాజిక వేత్త…ఎస్సీల్లో అత్యధిక జనాభా కల్గిన మాదిగ సామాజిక వర్గానికి చెంది ఉండి విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తిగా డా.జేఎస్ పరంజ్యోతి పేరొందాడు. విద్యారంగంలో విశిష్ట సేవలందించి ఎంతో మంది విద్యార్ధుల భవితకు భరోసా నిచ్చారు. పేదల చదువులకు కొండంత అండగా నిలిచి విద్యారత్నగా కీర్తిని ఆర్జించాడు. నాలుగు దశాబ్దాలుగా విద్యా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తి.
జయశంకర్ సర్ శిష్యరికంలో మెలిగిన వ్యక్తి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన తెలంగాణ ఉద్యమ సంగ్రామంలో పరంజ్యోతి క్రియాశీలక పాత్ర పోషించారు. 1977లో వరంగల్ లోని సికెయం కళాశాలలో జన్ను పరంజ్యోతి డిగ్రీ చదువుతున్నపుడు అప్పటి ప్రిన్సిపాల్ అయిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తో సన్నిహిత సంబంధం కల్గి ఉన్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ ని ఆదర్శంగా తీసుకొని ప్రేరణ పొందారు. అంతేకాకుండా విద్య, నాయకత్వం పట్ల అభిరుచిని పెంచుకున్నారు. లైవ్ టూ ఎడ్యూకేట్
ఎడ్యుకేట్ టు లివ్ అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసించారు.
18 ఏళ్ల నుండే పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్స్ చెపుతూ విద్యారంగంలోకి
అరంగ్రేటం చేశారు. ఎడ్యుకేషన్ ప్రాక్టిస్, రీసెర్చ్ లో 30 సంవత్సరాల అనుభవంతో సమర్థుడైన టీచర్ , అడ్మినిస్ట్రేటర్ , టీచర్ ఎడ్యుకేటర్ గా, ట్రైనర్ గా చురుకైన మేధావిగా ఉద్భవించారు. పాఠశాల నాలుగు గోడలకే పరిమితం కాలేదు. ఆయన శామరి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, స్టడీ స్కిల్స్, గైడెన్స్ తల్లిదండ్రులకు ఎడ్యుకేషనల్, సైకాలజీ, మెథడాలజీ, టెక్నాలజీ, క్లాస్ మెనేజ్మెంట్ స్కిల్స్ ఉపాధ్యాయులకు అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్స్ సిపెప్స్ (కరస్పాండెంట్ ప్రొఫెషనల్ ఎనిచ్మెంట్ ప్రోగ్రాం)అనే నవల శిక్షణా కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇచ్చారు.
1994లో విద్యాచట్టం జీఓఎంఎస్ నెంబర్ 1 లో సవరణలపై సలహా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి పరంజ్యోతిని ఆహ్వానించింది. స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కు వారు ప్రాతినిధ్యం వహించే సలహాదారుల కమిటీలో పరంజ్యోతి కూడా సభ్యులుగా ఉన్నారు.

సహకారాలు:
పరంజ్యోతి భారతదేశంలోనే మొదటిసారిగా విద్యార్థుల కోసం అకాడమిక్ అచీవ్ మెంట్ ఫైల్స్ ని రూపొందించారు. టీచర్స్ టైం, ప్రత్యేక బోధన పద్ధతులు, విద్యాబోధనకు అవసరం అయ్యే ఇక్విప్ మెంట్,అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ మెరుగుపరిచినారు. ఈ పద్ధతులను ప్రస్తుతం భారతదేశం మొత్తం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
విద్యారంగంలో చేపట్టిన బాధ్యతలు:
ఏపీ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కు ముఖ్య సలహాదారులు వ్యవహరించారు. వరంగల్ జిల్లా అన్ అయిడెడ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా, ఏపీ టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా కొనసాగారు.

(నిక్సా) నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్వాలిటీ స్కూల్స్ ఇన్ యాక్షన్ 2018 కన్వీనర్ గా,
స్టూడెంట్ యూనియన్ సి.కె. యం. కళాశాల వరంగల్ 1979 జనరల్ సెక్రెటరీగా ,
తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (టెప్సా)వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అడ్వకసి నిసా (నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్) వైస్ ప్రెసిడెంట్ గా, నోబల్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా, బేస్ ఎన్జీఓ, షమేరీ ఫౌండేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ (సిబీఎస్ఈ) దేశాయిపేట రోడ్, వరంగల్. తెలంగాణలో (1985లో స్థాపించబడినది)
చైర్మన్, కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. 2019 నాటికి ఒయాసిస్ స్టేట్ బోర్డు పదవతరగతి పరీక్షలకు 28 బ్యాచ్ల విద్యార్థులను పంపించింది. ఇప్పటి వరకు మూడు స్టేట్ ర్యాంకులను సాధించింది. 1995లో స్టేట్ 9వ ర్యాంక్ , 2003లో స్టేట్ 15వ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అనేక ఇతర ర్యాంకులు, అవార్డులు బహుమతులు సాధించింది.
ఉద్యమ నేపథ్యం :
1980వ సంవత్సరం కాలం నుండే తెలంగాణ అనే నినాదాన్ని తన మదిలో ఉంచుకున్నారు. భావజాలం వేత్త ప్రొఫెసర్ జయశంకర్.
నిర్మాణాత్మక దోపిడి తెలంగాణ వెనుకబాటు తనానికి చతుర్ముఖ సిద్ధాంతాల స్ఫూర్తితో విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై మేధోపరమైన చర్చల్లో తను సమయాన్ని వెచ్చించారు. యుక్త వయస్సు నుండే పరంజ్యోతి తెలంగాణ మేధావి దిగ్గజాలైన కాళోజీ, దాశరథి రంగాచార్య, దేవులపల్లి రామానుజారావుల వంటి కవిత్వాలకు ఆకర్షితుడై వర్తమాన కవిగా ఎదిగారు. ప్రొఫెసర్ జనార్ధన్ తో అనుబంధం ఉంది. ఇతర తెలంగాణ సమకాలీన ఉద్యమకారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్నాయి.

2000-2001 సంవత్సరంలో జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వ్యూహాత్మక ప్రణాళికతో ప్రజలను ప్రభావితం చేస్తూ, ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ దృఢ సంకల్పంతో 2001లో తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకున్నపుడు పరంజ్యోతి… ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వం ద్వారా ఎంతో ప్రేరణ పొందారు. ఉద్యమంలో ప్రైవేట్ పాఠశాలలను
భాగస్వామ్యం చేయడంలో ప్రధానపాత్ర పోషించారు. విద్యావేత్తలందరిని ఏకం చేశారు.
ప్రత్యేకించి సకల జనుల సమ్మె సందర్భంగా పరంజ్యోతి తెలంగాణ ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. మరియు వరంగల్ లోని తమ ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లతో సమావేశాన్ని న్విహించారు.
సకల జనుల సమ్మె:
సెప్టెంబర్ 2011న న్యూ ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ మేధావుల ఫోరంలోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి ప్రాతినిద్యం వహించారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వత్తుల ర్యాలీ, నిరసనకు ఆయన నాయకత్వం వహించారు. సకల జనుల సమ్మె సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులుగా ఉన్న జన్ను పరంజ్యోతిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తెలుగు న్యూస్ చానెల్ ప్రత్యేక్ష ప్రసార చర్చకు ఆహ్వానించి సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేయాలని చూసింది. కానీ పరంజ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొని సమాయానుకూల సమాధానాలతో సకల జనుల సమ్మెను, ప్రైవేట్ పాఠశాలల సమ్మేళనాన్ని సమర్ధించారు. వీరిని మేధావులు, సాధారణ ప్రజలు దీనిని జానపద సాహిత్య సమానంగా భావించారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు కూడా తెలంగాణ విముక్తి కోసం ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా పాల్గొనేలా ప్రేరేపించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీ సుబ్రమణ్యస్వామి, ఇతర జాతీయ నాయకులతో సంబంధాలు కల్గి ఉండిన వ్యక్తి.
తెలంగాణ మేధావుల ఫోరం తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషను ప్రాతినిద్యం వహించారు. 2012 ఆగస్టు 2న హైదరాబాద్లో జరిగిన తారామతిలో తెలంగాణ రాష్ట్రo ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత చిన్న రాష్ట్రాల ఫోరమ్ సమావేశాన్ని నిర్వహించారు.
మేధావి వక్తగా మీడియాలో, రేడియోలో, టీవీ చానెల్స్ లో జనాధరణ పొందారు.
పరంజ్యోతిని ప్రముఖ టివి చానెల్స్ అయిన ఈటీవీ, టీవీ9, దూరదర్శన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మొదలైన గుర్తింపు పొందిన ఎన్నో చానెల్స్లో లైవ్ డిబేట్స్ కు ఆహ్వానించాయి. విద్యార్థుల పరీక్షలు, పాఠ్యాంశాలు, సమస్యలకు సంబంధించి విద్యపై మేధోపరమైన చర్చలు ఇతర సమకాలిన సమస్యల గురించి లైవ్ డిబేట్లో చర్చించారు.
కీ నోట్స్ స్పీకర్, ప్రొఫెషనల్ ట్రైనర్ మోటివేటర్:
పరంజ్యోతి అనుభవజ్ఞులైన అడ్మినిస్ట్రేటర్ ప్రఖ్యాత విద్యావేత్త బెంగుళూరు హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా ప్రిన్సిపల్స్ కమిటీ కీలక సందేశాన్ని అందించడానికి మైక్రోసాఫ్ట్ వారు ఆహ్వానించారు.
పరంజ్యోతి విజయవాడలోని సేయింట్ ఆన్స్ గ్రూప్, హైదరాబాద్లోని ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, లోనావాలా లోని ఆర్య గురుకుల పాఠశాలకు చెందిన ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపాల్స్ కు
శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
కవి,గేయ రచయిత :
పరంజ్యోతి 100కి పైగా దేశభక్తి, దళిత విముక్తి పిల్లలు సాధారణ పాటలు, బ్యాలెట్, పద్యాలు వ్రాసారు. అవి ప్రచురింపబడ్డాయి. ఈ రచనలు, పాటలకు బహుమతులు కూడా గెలుచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన రాసిన జయహో తెలంగాణ పాట చాలా ప్రజాదరణ పొందినది.
పాల్గొన్న సెమినార్ లు:
పరంజ్యోతి ప్రతినిధిగా, స్పీకర్ గా హైదరాబాద్, అహ్మదాబాద్, కొచ్చి, చెన్నై, ముంబై, తిరువనంతపురం, ఢిల్లీ మొదలైన ప్రదేశాలలో ప్రత్యేకంగా విద్య మరియు సామాజిక పరమైన సమస్యలపై జాతీయ అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి సెమినార్ లలో పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థల అధ్యయనం కోసం సందర్శించిన దేశాలు :
(2014), కేమాన్ ఐలాండ్స్ (2014), థాయిలాండ్ (2015), శ్రీలంక (2017) అమెరికా (2008 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం)
అవార్డులు, గౌరవాలు:
దళితరత్న అవార్డు:
దళితుల విద్య కోసం చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 2015 ఏప్రిల్ 14న దళితరత్న అవార్డు బహుకరించారు.
ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కోసం ఇంటర్నేషనల్ అచీవ్మెంట్ అవార్డు:
భారత రాయబారి డా. విబి సోని సమక్షంలో థాయ్ లాండ్,మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ కొర్నే దబ్బరాన్సి,న్యూ ఢిల్లీలోని గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్ పాఠశాల విద్యా రంగంలో పరంజ్యోతి అందించిన విశేషమైన కృషికి 8 ఫిబ్రవరి 2015వ బ్యాంకాక్, థాయిలాండ్లో అవార్డు దక్కింది.
గౌరవ డాక్టరేట్ :
ఇండియన్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ చెన్నై వారు 28 ఫిబ్రవరి 2007న ముంబైలో జరిగిన కాన్వోకేషన్ వేడుకలో పరంజ్యోతి సేవలు సహకారానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
ది ఎమెరేటస్ స్కాలర్ అవార్డు:
2007 నవంబర్ 9న ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్, కేరళ వారు కొట్టాయంలో నిర్వహించిన కాన్వొకేషన్ వేడుకలో పరంజ్యోతి విద్యారంగానికి అందించిన విలువైన కృషికి ది ఎమిరేటస్ స్కాలర్ అవార్డు లభించింది.
రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు:
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రాజ్యలక్ష్మి కల్చరల్ ట్రస్ట్ తరఫున రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందుకున్నారు.
జ్యోతిరావు పూలే, డా. బీ ఆర్ అంబేద్కర్ విశిష్ట విద్యా పురస్కారం :
2010 ఏప్రిల్ 11న వరంగల్ లో ఏపీ టీచర్స్ యూనియన్ ద్వారా విద్యా రంగంలో పరంజ్యోతి విలువైన కృషికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.
ఆచార్యదేవో భవ అవార్డు :
2014 సెప్టెంబర్ 10న హైదరాబాద్లో బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ ద్వారా విద్యా రంగంలో విలువైన కృషికి ఈ అవార్డు లభించింది.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు:
2000సంవత్సరం ఏపీ ప్రభుత్వం వారు విద్యాశాఖ వారు వరంగల్ లో అవార్డును అందించారు.
బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు :
1999లో ఏపీ విద్యా శాఖ వారు 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్స్ సాధించినందుకు గాను ఈ అవార్డును బహుకరించారు.
బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు:
1998 లో లయన్స్ క్లబ్ ఎన్.జీ.వో. ద్వారా అందించారు.
బెస్ట్ స్కూల్ అవార్డు:
1997లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ వారు ఈ అవార్డును అందించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. మాదిగలో ప్రధమంగా జన్ను పరంజ్యోతి పేరు పరిశీలనలో ఉంది. విద్యా వేత్తగా రాష్ట్ర స్థాయిలో సంబంధాలు ఉండడం తెలంగాణ ఉద్యమంలో వరంగల్ నుండి కిలకి పాత్ర పోషించడం, పార్లమెంట్ లో తనదైన శైలిలో సామాన్యుల సమస్యలు నిర్భయంగా వినిపించగలిగే సామర్ధ్యం, ప్రజలకు వ్యక్తిగతంగా సేవ చేయడానికి కూడా ఆర్థికంగా స్థిరపడడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధిష్టానం పరంజ్యోతి పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొన్న జరిగిన శాసన సభ సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేట నియోజక వర్గం నుండి టికెట్ ఆశించారు. అధిష్టానం మాజీ ఐపిఎస్ కే ఆర్.నాగరాజుకు కేటాయించడంతో పార్టీ గెలుపుకు వర్ధన్నపేట, వరంగల్, తూర్పు, పశ్చిమ, పరకాల, ఘనపూర్ లాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విద్యా వ్యాప్తికి తాను చేసిన కృషిని కూడా పార్టీ పరిశీలన చేస్తున్నారు. అధిష్టానం అన్ని కోణాల్లోనూ పరిశీలించి జేఎస్ పరంజ్యోతికి వరంగల్ పార్లమెంటు టిక్కెట్ కట్టబెడితే గెలుపు నల్లేరు మీద నడకలానే ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా.