కో ఆపరేటివ్ చైర్మన్ గా రాములు యాదవ్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం నూతన చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, ప్రస్తుత సహకార సంఘం డైరెక్టర్ జడ రాములు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇప్పటి వరకు సహకార సంఘం చైర్మన్ గా ఉన్న జెర్రిపోతుల రాములు గౌడ్ పై సహకార సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో 13 మంది సభ్యులకు గాను ఒకరు మృతి చెందగా మిగిలిన 12 మంది సభ్యులు గురువారం డిసిఓ కిరణ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 11 మంది సభ్యులు తీర్మాణానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నూతన చైర్మన్ ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించగా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన డైరెక్టర్ జడ రాములు యాదవ్ ఒక్కరే బరిలో నిలువగా ఇతర సభ్యులెవ్వరు పోటీకి రాకపోవడంతో జడ రాములు యాదవ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. నూతన చైర్మన్ గా ఎన్నికైన జడ రాములు యాదవ్ ను సహకార సంఘం కార్యదర్శి రవీందర్ రావు, మాజీ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, వైస్ చైర్మన్ పద్మ, డైరెక్టర్లు చిర్ర సాంభ మూర్తి, మాలి శంకర్ రెడ్డి, శ్రీలత, లక్ ప్రకాష్, పాపయ్య, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లచ్చిరెడ్డి, బాలాజీ నాయక్ తదితరులు అభినందనలు తెలిపారు.