పిఎసిఎస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం నూతన చైర్మన్ గా రాములు యాదవ్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : వేములపల్లి మండల కేంద్రంలోని పిఎసిఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్ పై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వేములపల్లి పిఎసిఎస్ లో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను ఒకరు మృతి చెందగా మిగిలిన 12 మంది డైరెక్టర్లు గురువారం డిసిఓ కిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 11 మంది సభ్యులు తీర్మాణానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అనంతరం మధ్యాహ్నం పిఎసిఎస్ నూతన చైర్మన్ ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించగా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన డైరెక్టర్ జడ రాములు యాదవ్ పేరును తాజా మాజీ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్ ప్రతిపాదించగా మరో డైరెక్టర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ వల్లపుదాసు పద్మ ఆమోదం తెలపడంతో ఇతర సభ్యులెవ్వరు పోటీకి రాకపోవడంతో జడ రాములు యాదవ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.ఈ కార్యక్రమంలో డిసిఓ సూపరిండెంట్ విజయ్ కుమార్, సీనియర్ ఇన్సీపెక్టర్ స్వామి, జూనియర్ అసిస్టెంట్ సుభాన్, సిఈఓ రవీందర్ రావు, డైరెక్టర్లు చిర్ర సాంభమూర్తి, మాలి శంకర్ రెడ్డి, శ్రీలత, లక్ ప్రకాష్, పాపయ్య, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లచ్చిరెడ్డి, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.