వెంటాడిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే

లాస్య నందిత దుర్మరణం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించారు. ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మరణించారు. పటార్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీనియర్ నేత ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఈమధ్యే జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందిత బీఆర్ఎస్ కంటెన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత లిఫ్ట్ లో ఇరుక్కుని పోయి, ఈనెల 13 న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఆనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం సంభవించి హోంగార్డు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం  ఓఆర్ఆర్ నుంచి పటాన్ చెరువు దగ్గర డివైడర్ ను ఢీకొట్టిన ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking