ప్రజావాణికి 50 దరఖాస్తులు

ప్రజావాణికి 50 దరఖాస్తులు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజావాణి కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన 50 దరఖాస్తులు అందినట్లు జిల్లా స్థాయి అధికారులు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కోరారు.

గ్రీవెన్స్ కార్యక్రమంలో భాంగంగా ప్రజావాణి కి కట్టంగూరు నుండి వచ్చిన అంగవైకల్యం గల ఏర్పుల వెంకన్న అనే వ్యక్తికి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి హౌసింగ్ పీడీ రాజకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, స్త్రీ, శిశు, వికలాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారి బి. సక్కుబాయి లు కలిసి ట్రై సైకిల్ ను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking