*మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి*
*- మండలానికి ఈ కల తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీయే*
– రామన్నపేటలో బిఆర్ఎస్ పార్టీ భారీ రోడ్ షో…
– కేసులు, కొట్లాడటం కొత్తకాదు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
– మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
– నాలుగు నెలల్లోనే కరువు కాటకాలు వచ్చాయి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్
– రోడ్ షోలో హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, చెరుకు సుధాకర్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు మాసాలలోనే మరల ఎన్నికలు వచ్చాయి.. ఈ పరీక్ష నెగ్గాల్సి ఉన్నదని పార్టీ శ్రేణులకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. బుదవారం నాడు సాయంత్రం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎవరికన్నా అమలు అయ్యాయా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి గెలిచారన్నారు. ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీల మాటలు నమ్మి మోసపోయారని అన్నారు. రామన్నపేట పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు, కోట్ల నిధులతో రోడ్డు పనులు చేశానని అన్నారు. అనంతరం భువనగిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల్లోనే కరువు సంభవించిందని, అవకాశం ఇస్తే అభివృద్ది కోసం, నిధుల కోసం, కావాల్సిన రిజర్వేషన్ల కోసం గళం విప్పి కొట్లదుతానని, దేవుళ్ళు వేరు రాజకీయాలు వేరు అని, దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడిగే దుస్థితి ఉన్నదని అన్నారు. కోన నాలుకకి మందు పెడితే ఉన్న నాలుక ఉడినట్టు ఉన్నదని ప్రభుత్వ పాలన అని అన్నారు. దేశానికి కావల్సింది రాజ్యంగాలు మార్పు కాదు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని జీవితాలు ఇంకా ఎందరో గడుపుతున్నారని, వారికి మార్పు చేయాలని అన్నారు.

అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రామన్నపేట ప్రజానీకం ను చూస్తుంటే నకిరేకల్ నియోజకవర్గం లోని రామన్నపేట మండలం నుండి అత్యదిక మెజార్టీ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయాయి అని అన్నారు.

కేసులు, కొట్లడటం, కొత్తకాదు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన పార్టీ అని అన్నారు. ప్రజలను ఎవరు వదిలేసిన కెసిఆర్ మాత్రం వదిలెయ్యరు అని అన్నారు. ప్రజలు కూడా కెసిఆర్ వెంటే ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పోషబోయిన మల్లేషం, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు బొక్క మాధవ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు సాల్వెరు అశోక్, ఎడ్ల మహేందర్ రెడ్డి, బందెల రాములు, ముక్కాముల దుర్గయ్య, ఎంపీటీసీ వేమావరపు సుదీర్ బాబు, అవుల నరేందర్, చిన్నపాక రమేష్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.