కాంగ్రెస్ గూటికి … కైరంకొండ
మాజీ ఎంపీటీసీ యువ నేత కైరంకొండ వినోద్ కుమార్ ను
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :
మాజీ ఎంపిటిసి యువనేత,ప్రముఖ విద్యావేత్త కైరంకొండ వినోద్ కుమార్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగా బీర్ల ఐలయ్య ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యువ నేత మాజీ ఎంపీటీసీ ప్రముఖ విద్యావేత్త అయిన కైరంకొండ వినోద్ కుమార్ సీనియర్ నాయకులు అని, ఆయన పార్టీలో చేరడం వల్ల ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున బలోపేతం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినోద్ కుమార్ ను అభినందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడిని అయి కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, పేదలు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం చేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కైరం కొండ వినోద్ కుమార్ ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించి పూలమాలలు శాలువాలతో సత్కరించారు.
సేవా కార్యక్రమాలలో ముందున్న యువనేత కైరంకొండ వినోద్ కుమార్
కైరంకొండ వినోద్ కుమార్ మొదటి నుంచి సేవా కార్యక్రమాలలో ముందున్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకొని సానిటైజర్లు నిత్యవసర వస్తువులు అందించారు. అదేవిధంగా యువతకు స్పోర్ట్స్ కిట్స్ విద్యార్థులకు నోట్ బుక్స్ నిరంతరం అందిస్తున్నారు. వివిధ రకాలసామాజిక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం, సామాజిక స్పృహ కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం కైరం కొండ వినోద్ కుమార్ ప్రత్యేకత. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు ఇతర రుగ్మతలను రూపుమాపేందుకు ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను కైరంకొండ వినోద్ కుమార్ నిర్వహిస్తున్నారు. వృద్ధులు పేదలు అణగారిన వర్గాలను ఆదుకోవడానికి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సివిల్ ఇంజనీర్ లో డిప్లొమా కలిగిన విద్యావేత్త అయిన కైరంకొండ వినోద్ కుమార్ రాజకీయాలలో అంచలంచెలుగా ఎదుగుతూ యాదగిరిగుట్టలో ఎంపిటిసిగా విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా తిరుగులేని విజయం అందుకున్నారు రాజకీయాల్లో ఆయన యాదగిరిగుట్టలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. బీసీ నేతగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కైరంకొండ వినోద్ కుమార్ కు యాదగిరిగుట్ట పట్టణంలోనే కాకుండా మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి . బలమైన యువనేత బిసి సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కైరం కొండ వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మునుముందు ఆయన మరిన్ని మంచి పదవులు అధిరోహించి ప్రజలకు సేవ అందించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల స్థానికంగా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డమీది మాధవులు గౌడ్ సిలువేరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.