ఒక్క అవకాశం ఇవ్వండి ఐదేండ్లు సేవలందిస్తా
-ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్ది రామసహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఒక్క అవకాశం ఇవ్వండి ఐదేండ్లు సేవలందిస్తానని ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్ది రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని రాధాకృష్ణ నగర్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాందాస్ కృష్ణమూర్తి నివాసాంలో ఆత్మీయ సమ్మెళనంలో రఘురాం రెడ్డి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.ఈవిఎంలో 3 వ నెంబర్ లో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఉదయం వారి ఇంట అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భాలసాని లక్ష్మీ నారయణ మద్దినేని స్వర్ణకుమారి తదితురులు పాల్గోన్నారు.