రఘువీర్ రెడ్డిని గెలిపించాలి
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి
మాడ్గులపల్లి, అక్షిత ప్రతినిధి :
మే 13న జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి బలపర్చిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలలో మూడు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరో ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపించడం జరిగిందన్నారు.

పార్లమెంటు ఎన్నికల అనంతరం మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారన్నారు. ఈవిమ్ఎo మిషన్ లో మూడవ గుర్తు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మంగ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం పురుషోత్తం రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గమిని నిరంజన్,కట్టా శ్రీనివాస్ రెడ్డి, మంగ ఆంజనేయులు, మంగ శ్రీనివాస్, తంగేళ్ల సురేందర్ రెడ్డి, రాచూరి యాదగిరి, వల్లపుదాసు దేవయ్య, ,షేక్ రషీద్, షేక్ మాగ్దుమ్, నూకపంగ లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.