*బిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా*
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు మంగళవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.అనంతరంవేములపల్లి జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇరుగుదిండ్ల పద్మ గోవిందులు మాట్లాడుతూ అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నాయకత్వంలో అయన కుమారుడు నల్లగొండ పార్లమెంట్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నేత్రుత్వంలో కాంగ్రేస్ పార్టీ అభివృద్ధి కోసం తమవంతు కృషిచేయనున్నట్లు పేర్కొన్నారు.టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో వేములపల్లి జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇరుగుదిండ్ల పద్మ గోవిందు, మాజీ రావులపెంట, సల్కునూరు గ్రామ పంచాయతీ సర్పంచులు దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, అంకెపాక రాజు, శెట్టిపాలెం పిఏసిఎస్ డైరెక్టర్లు గొట్టే సైదులు, బంటు నాగమ్మ సైదులు, కోడిరెక్క శంభులింగం, ఆమనగల్లు మత్స్యకార్మిక సంఘము మాజీ చైర్మన్ చింతకాయల వీరేందర్, నిడుకొండ రామచంద్ర(చందు), వంగూరి వెంకటయ్య, ఇరుగుదిండ్ల రాజు తదితరులు ఉన్నారు.