సుందరయ్య  జీవితం… యువతరానికి ఆదర్శం

సుందరయ్య  జీవితం… యువతరానికి ఆదర్శం

 

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నీతి, నిజాయితీకి , నిరాడంబరతకు మారుపేరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య  జీవితం నేటి సమాజానికి, యువతరానికి ఎంతో అవసరమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున  అన్నారు. మే 19 పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ మండలంలోని కొత్తపల్లి, అనంతరం, కంచనపల్లి, గ్రామాలలో సిపిఎం జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది. అనంతారం గ్రామంలో పాలడుగు నాగార్జున ,కొత్తపల్లి గ్రామంలో పబ్బిళ్ళ ఎల్లయ్య, కంచనపల్లి గ్రామంలో భారతమ్మ, జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నేటి బూర్జువా పెట్టుబడిదారీ పాలకుల రాజ్యంలో కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని కమ్యూనిస్టులు మాత్రమే ఈ దేశాన్ని సక్రమమైన మార్గంలో నడుపుతారని అన్నారు. దేశంలో పేదరికం రోజురోజుకు పెరిగిపోతుందని దోపిడీదారుల ఆస్తులు వేల కోట్లల్లో పెరుగుతున్నాయని అన్నారు. పాలకుల ముందు చూపులేని విధానాల వలన దేశం అప్పుల పాలు అయిందని నిరుద్యోగం పెరిగిపోయిందని దరిద్రం పేదరికం వలన ప్రజలు గర్భ దరిద్రాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. నేడు పుచ్చలపల్లి సుందరయ్య  39వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుతూ సుందరయ్య దక్షిణ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకుడుగా ఉంటూ అనేక గ్రామాలలో మండలాలలో గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించిన ఘనత సుందరయ్యకి దక్కుతుందని అన్నారు. భవిష్యత్తులో భూమి బుక్, విముక్తి విద్యా వైద్యం ఉపాధి కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మానుపాటి ఎల్లయ్య బొల్లోజు భారతమ్మ గ్రామ కార్యదర్శిలు రుద్రాక్ష రాములు పాపయ్య చారి మరియు వెంకటయ్య భాగ్యమ్మ లక్ష్మమ్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking