నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:
నకిలీ విత్తనాలు అమ్మిన, కృత్రిమ కొరత సృష్టించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ,జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి కలెక్టర్ వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం విత్తన డీలర్ల షాపులను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో రైతులకు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులలో కూడా రెవెన్యూ ,పోలీస్ శాఖ ,మరియు వ్యవసాయ శాఖ అధికారులతో టీం ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రతిరోజు తప్పనిసరిగా మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, మండల విత్తన డీలర్ల షాపులను తనిఖీ చేయాలని, రోజువారి రైతులకు విక్రయించే రిజిస్టర్లను పరిశీలించాలని, రైతులకు విత్తనాల విక్రయించేటప్పుడు రసీదు ఇస్తున్నారా లేదా అని అంశాన్ని పరిశీలించాలని మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను కలెక్టర్ ఆదేశించారు. ఒకే రకమైన విత్తనాలు కావాలని డిమాండ్ లేదని, కావున విత్తన డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకూడదని, నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని అందరి అధికారులకు కలెక్టర్ సూచించారు. చెక్ పోస్టుల దగ్గర కల్తీ విత్తనాల సరఫరాపై నిఘా ఉంచి కల్తీ విత్తనాలు జిల్లా లోకి ప్రవేశించకుండా అందరి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ సమావేశంలో సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ గత సీజన్లలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిని కూడా ఎంక్వయిరీ చేస్తూ నిగా పెట్టాలని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిగా పెట్టాలని టాస్క్ ఫోర్స్ ఆదేశించారు. స్టేట్ చెక్ పోస్టులు డిస్టిక్ బోర్డర్ చెక్పోస్టుల వద్ద నిగా పటిష్టం చేయాలని ఎస్పీ ఆదేశించారు.ఈ వివేక్ వీడియో కాల్ గర్ల్స్ లో జిల్లా స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు, వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking