టీజీవో జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీజీవో జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని టీజీవో యూనియన్ ఖమ్మం ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి జాతీయ జెండా పతాకావిష్కరణను చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి శ్రీనివాస్ జిల్లా ఖజానా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణ టీజీవోస్ మహిళా కార్యదర్శి సుధారాణి ఖమ్మం టౌన్ అధ్యక్షులు శంకర్ కల్లూరు రెవిన్యూ డివిజన్ అధ్యక్షులు కుతూంభాక శ్రీనివాసరావు డాక్టర్ హరి కిషన్ జిల్లా ఉపాధ్యక్షులు నయీమ్ పాషా డాక్టర్ రమేష్ డాక్టర్ హరీష్ ప్రసన్న కుమార్ సతీష్ బాలాజీ సాదిక్ ఆలీ జినక వెంకన్న జెవి రామకృష్ణ పిడి వెంకన్న పుష్పరాజ్ శాంతకుమారి కృష్ణవేణి రవిచంద్ర ఎవియన్ రాజు మోదుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి మాట్లాడుతూ గెజిటెడ్ అధికారులందరికీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర సాదనకై ఉద్యమించిన తెలంగాణ అమర వీరులకు జోహార్లు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మనం కోరి పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని గుర్తుచేస్తూ స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఆకాంక్షలు త్వరగా నెరవేరాలని ఆశిస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking