జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలి
–గత ప్రభుత్వ తప్పిదాలే ఓటమికి కారణం
-టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి
-ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా రాష్ట్ర
అవతరణ దినోత్సవ వేడుకలు
◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అట్టహాసంగా ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలలో కొన్నింటిని పరిష్కరించినప్పటికీ ప్రధాన సమస్య అయిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో అనేకమార్లు హామీలు ఇచ్చి చివరకు బిఆర్ఎస్ ఆవిర్భావ ఖమ్మం సభలో నలుగురు ముఖ్యమంత్రులు లక్షలాది మంది ప్రజల మధ్య నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ నెల రోజుల్లో ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని నాటి మంత్రులు పువ్వాడ హరీష్ రావులతో కలసి హామీ ఇచ్చి మోసం చేశారని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను అణచివేచి మోసగాళ్లకు పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే నేటి ఓటమికి కారణమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తోందని వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియెడల జర్నలిస్టులు ఇండ్ల స్థలాల పరిష్కారంకోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అందులో ముఖ్యంగా జర్నలిస్టులు ఉద్యమ కారులు నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు సకల సబ్బండ వర్గాలు ఐకమత్యంతో చేసిన పోరాట పటిమ మరువలేనిదన్నారు.అనంతరం టీయూడబ్ల్యూజే(టిజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి పిన్ని సత్యనారాయణ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి మందుల ఉపేందర్ నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు కోశాధికారి బిక్కి గోపి ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్ కరీష అశోక్,మహిళ సీనియర్ జర్నలిస్ట్ వంగూరి ఈశ్వరి భారతి తిరుపతిరావు వల్లూరి సంతోష్ ముత్యాల కోటేశ్వరరావు ఉత్కంఠం శ్రీనివాస్ పి. పానకాలరావు బండి కుమార్, వెంకట కృష్ణారావు ఖాసీం అంతోటి శ్రీనివాస్ యాదగిరి నాగేశ్వరరావు జీవన్ రెడ్డి మందుల వెంకటేశ్వర్లు గెంటెల కుమార్ వెంకటేశ్వర్లు వెంకట్ వెంకటేష్ పులి శ్రీను వెంపటి నాయుడు రమేష్ వెంకట్ రెడ్డి ఆంజనేయులు శ్రీధర్ శివకృష్ణ శ్రీనివాసరావు శ్రీనివాస్ మురళి సంపత్ మహేష్ ఉపేందర్ యాదగిరి గుండు శ్రీను రవీందర్ తదితరులు పాల్గొన్నారు.