అమరుల త్యాగాలు వెలకట్టలేనిది

అమరుల త్యాగాలు వెలకట్టలేనిది

– తెలంగాణ ఉద్యమంలో అమరులైనకుటుంబాలకు అండగా ఉంటాం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగింపు వేడుకల సందర్భంగా ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన 10 యేండ్ల లో ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. ప్రజా ప్రభుత్వం లో ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను గుర్తించి, సన్మానాలు చేసి, వారి త్యాగాలకు గుర్తింపుగా ఇంటి స్థలం ఇవ్వడానికి ముందుకొస్తుంటే అవాకులు చావాకులు పేలుతున్నారు. మా ప్రభుత్వం అమరులను ఉద్యమకారులను అన్ని విధాలుగా వారికి న్యాయం చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుందని అన్నారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు చేపట్టబోతునామని అన్నారు.


ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటు అమరుడైన శ్రీకాంతి చారి తల్లీ శంకరమ్మ ను మరియు తెలంగాణ ఉద్యమకారులను అమరుల కుటుంబ సభ్యులను ఘనగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంఎల్ఏ లు, కార్పొరేషన్ చైర్మన్ లు జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు
తో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking