సీసీ రోడ్డు వేశారు..  నీళ్లు పట్టడం మరిచారు..

సీసీ రోడ్డు వేశారు..  నీళ్లు పట్టడం మరిచారు..

పర్యవేక్షణ లోపం కారణంగానే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో గత ఐదు రోజుల క్రింద ఎన్ఆర్ఐఎస్ నిధుల నుండి 15 లక్షల రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్డు వేశారు. కానీ, దానికి మళ్ళీ తిరిగి చూసే నాథుడే కరువు అయ్యారు.సీసీ రోడ్డుపై కట్టలు కట్టి క్యూరింగ్ చేపట్టాలి అలా చేపడితేనే రోడ్డు నాణ్యతగా ఉంటుంది.ఇంత వరకు రోడ్డు వేసి రోజులు గడుస్తున్న కూడా క్యూరింగ్ జరగకపోవడంతో.. రోడ్డు వేశామా అంటే వేశాం అన్నట్లుగా రోడ్డు వేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. క్యూరింగ్ సరిగా చేయకుంటే పది కాలాల పాటు ఉండాల్సిన రోడ్డు కొద్ది రోజుల్లోనే నెర్రెలు వారి రోడ్డు పగుళ్లు ఏర్పడి ప్రజాధనం వృధా అయ్యే అవకాశం మెండుగా ఉంది. సీసీ రోడ్డు వేసి క్యూరింగ్ చేయకపోవడంపై కాలనీ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వేసిన సీసీ రోడ్డుకు సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే కాంట్రాక్టర్ రోడ్డు వేసి క్యూరింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అంతకు ముందు సీసీ రోడ్డు వేయటం జరిగింది.దానికి కూడా రోడ్డు వేసి నీళ్లు రెండు రోజులు పోసి ఆపివేయటం జరిగింది.ఎవరి ఇంటి ముందు వారే నీళ్లు పోసుకుంటున్నారు.అలాగే రోడ్డుపై కట్టలు కూడా తీసుకుంటున్నారు.ప్రజలకు ఉపయోగపడేలా రోడ్డు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కాలనీ వాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking