పది రోజులైనా… పట్టింపు లేదు
పంచాయతీ నోటీస్ కు పది రోజులు
*లేబర్ కాలనీపై నోటీసులు, స్కూల్ కొలతలపై ఆరా ఎప్పుడు?
*ఎంక్వయిరీ కాకుండానే పైరవీదారుల నుంచి ఫోన్లు
*ఎంక్వయిరీ సక్రమంగా జరిగేనా?
చింతలపాలెం, అక్షిత న్యూస్ :
చింతలపాలెం మండల కేంద్రంలో అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ టాక్స్ ల ఎగవేత కథనాలలో భాగంగా మండల పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ అధికారులతో కలిసి ఫ్యాక్టరీ లేబర్ కాలనీ,సీతా మెమోరియల్ స్కూల్ కి సంబంధించిన పత్రాలు గురించి నోటీసులు జారీ చేస్తూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ బ్లూ ప్రింట్ పూర్తి సమాచారాన్ని గ్రామపంచాయతీకి ఏడు రోజుల్లోగా సమర్పించాలని అలాగే స్కూల్ బిల్డింగ్ కొలతలు తేడా ఉన్నందున కొలతలు కొలిచేందుకు గ్రామపంచాయతీ అధికారులకు సహకరించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు.ఇదంతా జరుగుతుండగానే పైరవీదారులు నుంచి అధికారులకు ఫోన్లు మొదలయ్యాయని అసలు ఎంక్వయిరీ పూర్తి సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానం కలిగేలాగా ఉందని చింతలపాలెం ప్రజలు అంటున్నారు.నోటీసుకు సమాధానం వారం రోజుల్లో రాకపోతే నెక్స్ట్ నోటీస్ ఎప్పుడు? అది కూడా పైరవీ దారుల ఫోన్ తో ఆగిపోయిందా? ఆగిపోయింది అర్థం కావట్లేదని ప్రజలు అంటున్నారు.