శ్రీశైలం ప్రజాపతిని అభినంధిన సిఎం రెవంత్ రెడ్డి
నకిరేకల్ అక్షిత ప్రతినిధి :
నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అరూరి శ్రీశైలం ప్రజాపతి బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ఆయన సీఎంని కలిశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ఓటరు మహాశయులకు శ్రీశైలం ప్రజాపతి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న శ్రీశైలం ప్రజాపతిని సిఎం రెవంత్ రెడ్డి అభినందించారు