మంత్రి తుమ్మలను కలిసిన మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన బలరాం నాయక్ మంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా వచ్చి తన విజయానికి ఎంతగానో కృషి చేసిన మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో గెలుపొందిన పోరిక బలరాం నాయక్ ని శాలువా కప్పి సన్మానించినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపి మాజీ ఎమ్మెల్యే రామసహాయం సురేందర్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు జాటోత్ రామచంద్ర నాయక్ భూక్య మురళి నాయక్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆదినారాయణ మట్టా దయానంద్ రాగమయి మాలోత్ రాందాస్ నాయక్ మట్టా దయానంద్ డాక్టర్ తుమ్మల యుగంధర్ జిన్నారెడ్డి భరత్ చంద్ర సాదు రమేష్ రెడ్డి నున్న రామకృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.