నాణ్యత లోపిస్తే
కఠిన చర్యలు
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కృషి
దెబ్బతిన్న రోడ్లను నాణ్యత ప్రమాణాలతో మరమ్మతు చేయాలి
అన్ని వసతులతో కూడిన మౌళిక సదుపాయాలు కల్పించాలి
సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రహదారుల మరమ్మత్తుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గురువారం
పంచాయతీరాజ్ శాఖపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గ్రామీణ రహదారుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ నిధుల ఉపయోగించి గ్రామీణా రహదారుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.
పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థలలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పంచాయితీల మౌలిక సదుపాయాల కోసం కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. పంచాయతీల్లో ఇప్పటికే పాడైన రోడ్లకు మరమ్మత్తులు, కొత్త రోడ్డ నిర్మాణం వంటి అంశాలపై అంచనాలు తయారు చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ఇఎన్‌సి, ఇతర అధికారులు పాల్గొన్నారు.