సంఘ పటిష్ఠతకు సమిష్టి కృషి

యూనియన్ బలోపేతానికి సమిష్టి కృషి

చిన్న పత్రికల సమస్యల సాధనకు కృషి చేస్తా

మాతంగి దాస్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పత్రికల యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం అధ్యక్షుడు మాతంగి దాస్ పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జరిగిన టిఎస్ఎండిపిఏ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని పటిష్టపరిచే విధంగా మార్గదర్శకాలు తయారు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న పత్రిక ఎడిటర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వo, సమాచార శాఖ మంత్రి, కమీషనర్ దృష్టికి తీసుకువెళ్తానని వివరించారు. చిన్న పత్రికలకు పెట్టుబడులు అధికమవుతున్నాయని ఆదాయం మాత్రం తగ్గిపోతుందని తెలిపారు. చిన్న తరహా పత్రికలను ప్రోత్సహించడంలో భాగంగా రెగ్యులర్ గా వివిధ పథకాల అమలుకు సంబంధించిన ప్రకటనలు, భూ ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గతంలో చిన్న పత్రికలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో టిఎస్ఎం డిపిఏ విశేష కృషి చేసిందని చెప్పారు.సంఘం పనితీరు పట్ల పలువురు రాష్ట్రస్థాయి అధికారులు, మరియు వివిధ సంఘాల యూనియన్ నాయకులు సైతం అభినందనలు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పత్రికల సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు, అందుకు యూనియన్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పారు. గతంలో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను కూడా విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిరంతరం జర్నలిస్టుల చిన్న పత్రికల సమస్యపై పోరాడుతున్న తమ సంఘం పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారని, భవిష్యత్తులో జిల్లాల వారీగా క్యాంపు నిర్వహించి నూతన కమిటీలు వేస్తామన్నారు. సంఘ గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాదీనం మాట్లాడుతూ చిన్న పత్రికల ఎడిటర్ల జీవన విధానం సర్వసాధారణంగా ఉంటుందని, ఆదాయం తక్కువ పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా ప్రైవేట్ రంగo నుంచి వచ్చే ప్రకటనలే ఆధారంగా నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదని చిన్న పత్రికల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎండిపిఏ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మక్సుద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాసరావు, సోమారపు యాదయ్య, కోటగిరి చంద్రశేఖర్, ఫ్లాష్ ఇండియా ఎడిటర్ శ్రీనివాస్, యువ తెలంగాణ ఎడిటర్ శ్రీనివాస్, పైలం పత్రిక ఎడిటర్ పేర్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking