ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
– ప్రయివేటు పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి
– ఎర్ర నరేష్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎస్ ఎస్ యూ మండల నాయకులు స్వేరో సర్కిల్ వాలంటరీ ఎర్ర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేయాలని, దాని కోసం చట్టం తేవాలని అన్నారు.

పాఠశాలలు ప్రారంభం అయిననందున విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని, మధ్యాహ్నం బోజన పథకం సరిగ్గా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగు నీరు, మూత్ర శాలలు, ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర బిక్షపతి, ఎర్ర శివ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు