ప్రతి నిండు జీవితానికి రెండు చుక్కలు
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత
*ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో, మండలాల్లో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో
అలాగే దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అభినందించారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలియో నిర్మూలన లక్ష్య సాధనకు ప్రజలంతా సహకరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డి. స్కై ల్యాబ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్,కౌన్సిలర్లు దైద సోమసుందర్, కొమ్ము శ్రీనివాస్, ఉబ్బపలి మధు, ఉబ్బపల్లి కాశయ్య, రామకృష్ణ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ దీపా, వైద్యధికారులు డాక్టర్ నిపుణ్, డాక్టర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశావర్కర్స్, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.