నెస్ట్స్ స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుడిగా శ‌ర‌త్

నెస్ట్స్ స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుడిగా శ‌ర‌త్
గిరిజ‌న సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శికి జాతీయ క‌మిటీలో చోటు
– అభినందించిన ఏక‌ల‌వ్య‌, గురుకుల పాఠ‌శాల‌ల సిబ్బంది

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్ట‌ర్ శ‌ర‌త్ కు జాతీయ స్థాయి క‌మిటీలో చోటు ద‌క్కింది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్‌) లో శ‌ర‌త్ ను స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మిస్తూ కేంద్ర గిరిజ‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న ఏడాదిపాటు ఈ క‌మిటీలో స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు. నెస్ట్స్ అనేది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ. గిరిజన జనాభా అధికంగా ఉండి, అక్షరాస్యత త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడం కోసం గిరిజ‌న సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటి నిర్వ‌హ‌ణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, కేంద్ర ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించ‌డంపై స్టీరింగ్ క‌మిటీ ప‌నిచేయ‌నుంది. ఈ స్టీరింగ్ క‌మిటీ సభ్యుడిగా దేశంలోని అన్ని అన్ని రాష్ట్రాల తరపున తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శిని కేంద్రం నామినేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా గిరిజన, ఏకలవ్య మోడల్ పాఠశాలల, గిరిజన గురుకుల సిబ్బంది డాక్ట‌ర్ శ‌ర‌త్ ను అభినందించారు. గిరిజనుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ శరత్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింద‌న్నారు. డాక్ట‌ర్ శ‌ర‌త్‌.. గతంలో భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పని చేశారు. కామారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ గా పని చేశారు. ఇటీవల ప్ర‌భుత్వం ఆయ‌న‌ను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking