32 జిల్లాల్లో 6148 పాల సేకరణ కేంద్రాలు
40445 పాడి సేకరణ కేంద్రాలతో 4.20 లక్షల లీటర్లు
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
విజయ తెలంగాణ డెయిరీ 32 జిల్లాల్లో 6148 పాల సేకరణ కేంద్రాల నుండి సుమారు 40445 పాడి రైతుల ద్వారా ప్రతిరోజు సరాసరి 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నదని తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో పాల కొరత ఉన్న సందర్బం లో, పాలఉత్పత్తి, పాడి రైతులను మరింతగా సహకార రంగంలోతేవాలనే ఉద్దేశంతో విజయ తెలంగాణ డెయిరీ (01-02-2022, 01-09-2022 & 01-04-2023) 3 సార్లు లీటరుకు రూ.12.48 పైసలు పెంచడం జరిగింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా భారతదేశం లోకెల్లా అత్యధికంగా సుమారు రూ. 42.24 ప్రతి లీటర్ పాలకి రైతులకి చెల్లిస్తున్నది. దీని వల్ల రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
అయితే గత సంవత్సరకాలంగా దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి పెరిగింది. ముఖ్యాంగా పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పాలు అతి తక్కువ ధరకి అందుబాటులోకి రావటంతో, మార్కెట్లో పాల ధర తగ్గింది. ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కోఆపరేటివ్ రంగంలోని డెయిరీలు కూడా పక్క రాష్ట్రాల నించి రూ. 26-34 కి పలని సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి మన రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇతర సహకార డెయిరీలు (నెల్లూరు, క్రిష్ణ, కర్నూలు) విజయ పేరుతో అక్రమంగా అమ్మకాలు జరుపుచున్నవి. ఈ సిబ్లింగ్ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి.
తెలంగాణ విజయ డెయిరీ పాడి రైతులకు అత్యధిక సేకరణ ధర లీటరుకు రూ. 42.24 చెల్లిస్తున్నందున, మార్కెటింగ్ కమిషన్లు పెంచే అవకాశం తక్కువ . దీనివల్ల విజయ అమ్మకాలమీద ప్రభావం పడి, అమ్మకాలు తగ్గి ప్రతిరోజు సుమారు 2.7 లక్షల లీటర్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ప్రతిరోజూ సుమారు 1.5 లక్షలలీటర్ల పాలు మిగిలి వాటిని అదనపు ధర చెల్లించిమిల్క్ పౌడర్, బటర్ గా తయారుచేసి నిలువచేయటం జరుగుతుంది. జాతీయ మార్కెట్ లో బటర్, మిల్క్ పౌడర్ ధరలు కూడా అతి తక్కువగా ఉండటం వలనవాటి అమ్మకాలపై కూడా నష్టం వాటిల్లే ప్రమాదంఉంది.
అయితే ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, ప్రభుత్వ అద్వర్యంలో నడుస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, గురుకులాలు, వసతి గృహాలకు, దేవదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు , ఐటీడీఏ ఆద్వర్యంలో ఉన్నటువంటి సంస్థలకు , ఐసీడీఎస్ద్వారా నడుస్తున్న ఆంగన్వాడీ కేంద్రాలకు పాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, నెయ్యి, ఇతర పాల పదార్ధాలు విజయ డెయిరీ ద్వారా మాత్రమే సరఫరా చేయాలనే ఆదేశాలు జారీచేయబడ్డాయి. దీని వలన అదనంగా సేకరించబడ్డ మిగులు పాలు ఉపయోగింపబడి, నష్టాలను తగ్గించుకోవడం జరుగుతోంది.
ప్రభుత్వ సహకారంతో ట్రయల్ రన్ లో ఉన్నటువంటి విజయ మెగా డైరీని కూడా అతి త్వరలో పూర్తి ఉత్పాదక స్థాయికి తెచ్చి, మిగులు పాలను హైదరాబాద్ మరియు ఇతర మర్కెట్లకు నాణ్యమైన పాల ఉత్పత్తులుగా అందించడం ద్వారా రాష్ట్ర రైతాంగం ఉత్పత్తి చేసేపాలను వినియోగం లోకి తీసుకురావాలానే లక్ష్యంతో విజయ డైరీ పని చేస్తుంది.
అదేవిధంగా రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పాల బిల్లులను కూడా అతిత్వరలో చెల్లించటానికి విజయ డెయిరీ కృషి చేస్తుంది.
ప్రభుత్వ రంగంలో, లాభాపేక్ష లేకుండా, వినియోగదారుడికి సరసమైన ధరలో కల్తీకి ఆస్కారంలేని నాణ్యమైన పాల ఉత్పత్తులని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నటువంటి తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలందరూ విరివిగా ఆస్వాదించి, ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ప్రయత్నాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాం.