నల్ల చెర్వుకు మళ్ళీ గండి

*పాలకుల నిర్లక్ష్యమా…

పాలనాధికారుల నిర్లక్ష్యమా*
*చెరువు కట్టకు మళ్ళీ గండి

రాకపోకలు బంద్.*

*సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ*

*సూర్యాపేట, అక్షిత బ్యూరో :

అకాల వర్షానికి మళ్ళీ నల్లచెరువుకు గండి పడింది. ఇటీవల కురిసిన వర్షానికి గండి పడినప్పటికీ పటిష్టవంతంగా పూడ్చలేని పరిస్థితి. మంత్రి ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.బూరుగడ్డ నల్ల చెరువు కట్ట మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి చెరువు కట్ట తెగి రోడ్డు కొట్టకపోయి బూరుగడ్డ కరక్కాయలగూడెం హుజూర్నగర్ కు రాకపోకలు నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసినదే.స్థానిక మంత్రి తెగినటువంటి చెరువులను రోడ్లను యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు.కానీ ఇప్పటివరకు బూరుగడ్డ నల్లచెరువు కట్ట పనులు పూర్తి కాకపోగా రాత్రి కురిసిన చిన్న వర్షానికి మళ్లీ గండి పడింది. ఎందుకింత నాణ్యత లోపం పనులు చేస్తున్నారు. అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతినిత్యం బూరుగడ్డ కరక్కాయల గూడెం గ్రామ ప్రజలకు హుజూర్నగర్ రానిది వారికి పనులు జరగవు.మళ్లీ ఇప్పుడు చుట్టూ తిరిగి రావాలంటే ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

పనుల్లో నాణ్యత లోపం
చెరువు కట్టకు గండి పూడ్చేందుకు పనులు చేస్తున్నప్పటికీ రాకపోకలు కొనసాగేందుకు పెద్ద పెద్ద సిమెంటు గూనలు తెచ్చి అక్కడ ప్రజల ప్రదర్శనకు ఉంచారు.ఆ గూనలను రోడ్డుకు నీళ్లు పోయే విధంగా గూనలు వేస్తే ఆ నీళ్లు ఆ గుణాలు గుండా ఇబ్బంది లేకుండా నీరు బయటకు వెళ్లిపోయేది గ్రామ ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేది కానీ ఆ గూనలను జన ప్రదర్శనకు మాత్రమే నిలిపినట్టుగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి.ఇప్పటికైనా అధికారులు ఈ నల్ల చెరువు పై దృష్టి పెట్టి గండి పూడ్చినటువంటి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యత లోపం జరగకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా చాలా పగడ్బందీగా నల్లచెరువు కట్టను నిర్మించాలని చుట్టూ ప్రక్కల గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking