శ్రీ వారి లడ్డు పవిత్ర ప్రసాదం కల్తీ మయం
గ్రాడ్యుయేట్స్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దయల ఓం ప్రసాద్
కరీంనగర్,అక్షిత బ్యూరో:
కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానమని తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వారికి ఎంతో పవిత్రంగా అమృతంతో సమానమని అలాంటిది తిరుమల చరిత్రలో మొట్ట మొదటిసారిగా పవిత్రమైన లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు తో పాటు కల్తీ నెయ్యి చేప నూనెలను వినియోగించడం చాలా దారుణమని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు న్యాయవాది సైకాలజిస్ట్ దయాల ఓంప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు
శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు అత్యంత భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వం వర్ణానాతీతమని అంతటి పవిత్రమైన లడ్డు ప్రసాదం కల్తీకి గురికావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
రమణ దీక్షలు సైతం తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారన్నారు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారని ఈ సందర్భంగా ఓం ప్రసాద్ గుర్తు చేశారు
25 రూపాయలు ఉన్న లడ్డును గత ప్రభుత్వం 50కి పెంచిందని అయినప్పటికీ లడ్డు నాణ్యతలో రాజీపడడం దారుణమని ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుందన్నారు ధర పెంచితే నాణ్యత పెంచాల్సింది పోయి పైగా కల్తీ చేయడం అత్యంత ఏహ్యమైన చర్య అని దుయ్యబట్టారు ఈవిషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఓంప్రసాద్ కోరారు