అర్హులైన జర్నలిస్టుల వివరాల సేకరణ చేపట్టాలి

అర్హులైన జర్నలిస్టుల

వివరాల సేకరణ చేపట్టాలి

*జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయం*

*సహకరించాలని కోరిన జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు*

మేడ్చల్, అక్షిత బ్యూరో :

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం యూనియన్ పకడ్బందీగా పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం సూరారం విఐపి ఫంక్షన్ హాల్లో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా జర్నలిస్టులకు హౌసింగ్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం జీవోలు జారీ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపిస్తుందని తెలిపారు.

ఇది ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రభుత్వం పెద్దలు చూపిస్తున్న మార్గదర్శకాల మేరకు సమాజంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ, మండలాల వారిగా సమావేశాలను నిర్వహించి వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. రానున్న వారం రోజులలో ప్రాంతాలవారీగా సమావేశాలను ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైందని స్పష్టం చేశారు. జిల్లాలో సేకరిస్తున్నటువంటి జర్నలిస్టుల వివరాలను మీడియా అకాడమీకి అందజేస్తామని జిల్లా అధ్యక్షులు గడ్డమీద బాలరాజ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రితో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి జర్నలిస్ట్ కృషి చేయాలని కోరారు. యూనియన్లకు అతీతంగా మండలాలు నియోజకవర్గం వారిగా సీనియార్టీ ప్రతిపాదికతన లిస్టులను తయారు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, కోశాధికారి బిక్షపతి, ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking