పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులు వెంటనే పూర్తి చేయాలి
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి మంగళవారం పంట పొలాలకు నీళ్లు అందించాలి
-పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలన
ఖమ్మం /అక్షిత బ్యూరో :
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మంగళవారం నాడు రైతులకు సాగునీరు అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం మంత్రి పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైతులు ఇబ్బంది పడకుండా మంగళవారం నాటికీ సాగునీరు అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.పనుల పరిశీలన కార్యక్రమంలో మంత్రి వెంట ఇరిగేషన్ సిఇ విద్యాసాగర్ ఇఇ అనన్య అధికారులు తదితరులు ఉన్నారు.