విద్యార్థులకు భోజనంలో పురుగుల అన్నం
కొమ్మూరు పాఠశాల తనిఖీ
ముక్కిపోయిన బియ్యముతో మధ్యాహ్న భోజనం
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్,అక్షిత ప్రతినిధి :
కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తినడానికి పురుగులు పట్టిన బియ్యం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పండిపడుతున్నారు.. విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టి పురుగులు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ పాఠశాలకు వస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు కొమ్మూరు గ్రామానికి వెళ్లి పాఠశాలను సందర్శించారు. బియ్యం నిలువ ఉంచిన గదిని మాజీ ఎమ్మెల్యే పరిశీలించాగా పురుగులు పట్టిన బియ్యం దర్శనం ఇచ్చాయని, అన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో 10 నెలల్లో ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.