మంత్రి కొండ సురేఖకు ఆర్యవైశ్య నాయకుల వినతి
చేర్యాల,సెప్టెంబర్ 25 అక్షిత ప్రతినిధి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం పేరును మార్చవద్దని జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు అయిత రత్నాకర్, జిల్లా అధ్యక్షులు కాచం నవీన్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్ రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా పలువురు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పేరు పెట్టుటకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంతో తెలంగాణ రాష్టంలోని ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతింటునాయని, భాష ప్రాతిపదికఫై రాష్ట్రాలు ఏర్పాడాలని అమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడి పేరును విశ్వవిద్యాలయం మార్చడంతో ఉమ్మడి రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, పొట్టి శ్రీరాములు పేరును అలాగే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహా సభ జిల్లా ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి తణుకు ఆంజనేయులు, జిల్లా యూత్ అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పుల్లరి శివ కుమార్,జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ పాండురంగం,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హరినాథ్, జిల్లాలలోని వివిధ మండలాల అధ్యక్షులు మంకల నగేష్, గుండ శ్రీనివాస్,గోపాల్,వంగపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆంజనేయులు, భద్రయ్య, చింత రాజేంద్ర ప్రసాద్, సిద్ధి బిక్షపతి, యాద శ్రీనివాస్, ఉప్పల నాగరాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.