చేర్యాల ప్రగతికి చొరవ చూపండి
జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పల్లా
చేర్యాల,సెప్టెంబర్ 25 అక్షిత ప్రతినిధి:
సిద్దిపేట జిల్లా కలెక్టర్ అద్యక్షతన బుధవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ జనగామ నియోజక వర్గంలోని చేర్యాల మున్సిపాలిటీ మరియు చేర్యాల,కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చేర్యాల రెవెన్యూ డివిజన్,చేర్యాల సివిల్ జడ్జి కోర్టు, ఐనాపూర్ 33/11 కె.వి సబ్ స్టేషన్, కడవేర్గు వంతెన మరియు చేర్యాల నుండి శభాష్ గూడెం వరకు డబల్ రోడ్డు, నాగపురి నుండి పడమటి కేశపూర్ వరకు పిఆర్ మంజూరు కోసం, చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, మందుల కొరత గురించి, మరియు మద్దూరు లో పేదలకు సంబంధించిన ప్లాట్ల గురించి ఎమ్మెల్యే చర్చించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవదాలు తెలియజేసిన బిఆర్ ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు .