స్థంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ అధ్యక్షులుగా కనకం సైదులు

స్థంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ అధ్యక్షులుగా కనకం సైదులు

సత్వర ఇండ్ల స్థలాల సాధనకు కృషి

ఖమ్మం/అక్షిత బ్యూరో :

స్థంభాద్రి జర్నలిస్టు మ్యూచువలీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఖమ్మంకు అధ్యక్షులుగా కనకం సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ ఆవిర్భావం నుంచి అధ్యక్షులుగా కొనసాగిన ఏనుగు వెంకటేశ్వరరావు రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బుధవారం స్థానిక మంచికంటి భవనంలో టియుడబ్ల్యూజె (ఐజేయు) టియుడబ్ల్యూజె (టిజెఎఫ్) టియుడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టు సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఇండ్ల స్థలాల సాధనకు సంబంధించి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ డైరెక్టర్లు సమావేశమై నూతన అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు పలు తీర్మానాలు చేయడం జరిగింది. తొలుత సంఘం ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమై ఏనుగు వెంకటేశ్వరరావు రాజీనామాను సభ్యుల చర్చల అనంతరం ఆమోదించడం జరిగింది. నూతన అధ్యక్షులుగా కనకం సైదులు పేరును ఏనుగు వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా వై. సాంబశివరావు బలపరిచారు. పోటీ లేకపోవడంతో అధ్యక్షునిగా కనకం సైదులు ఎన్నికైనట్లు ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాసరావు ప్రకటించారు. అనంతరం కనకం సైదులు అధ్యక్షతన సొసైటీ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈసమావేశంలో తొలి తీర్మానాన్ని మైసా పాపారావు ప్రవేశపెట్టారు. సంఘ సభ్యత్వాన్ని పెంపుదల చేయాలని వీలైనంత త్వరలో అర్హత కలిగిన సభ్యులందరికి సభ్యత్వం ఇవ్వడంతో పాటు అన్ని సంఘాలను కలుపుకుని ఇండ్ల స్థలాల సాధనను మరింత వేగవంతం చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించారు. అధ్యక్షులు కనకం సైదులు సొసైటీకి ఇప్పటి వరకు ఉపాధ్యక్షులుగా కార్యదర్శిగా కోశాధికారిగా పనిచేసిన వారు రాజీనామా చేసి తిరిగి నూతనంగా ఎన్నిక జరపాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. జర్నలిస్టు యూనియన్ల సహకారం కూడా తీసుకోవాలని మూడు సంఘాల నుంచి ఒక్కొక్కరి చొప్పున సలహా మండలిగా ఏర్పాటు చేసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో నిరంతరం సంబంధాలు నిర్వహిస్తూ ఏలైనంత త్వరగా స్థలాలను రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు బత్తుల వాసు, అలస్యం అప్పారావు పాల్గొన్నారు. వాసు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking