రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలి...
జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా…
జనగామ, అక్షిత ప్రతినిధి:
రోడ్ ప్రమాదాల నివారణకి అన్నీ రకాల భద్రత చర్యలను తీసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో రోడ్ భద్రత కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వాహనదారులు రోడ్డు భద్రత నియమనిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని…
అతివేగం వల్ల వాహనాలు అదుపుతప్పి.. ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.జిల్లా ఆరంభం అయ్యే దగ్గరి నుండి… ముగింపు ప్రాంతం వరకు…పోలీస్, నేషనల్ హై వే, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి… ప్రమాదాలు తరుచూ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాలని….అలాగే ప్రమాదాల నివారణకు తీసుకోవలిసిన చర్యలకు సంబందించి నివేదికను పది రోజుల్లో అందించాలన్నారు.ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు.ప్రమాదాలు జరిగే ముఖ్య ప్రదేశాలలో ప్రమాద సూచిక లు, మలుపు ల వద్ద స్పీడ్ లిమిట్ సూచికలు తప్పనిసరిగా ఉండాలన్నారు.జిల్లా మీదుగా వెళ్తున్న నేషనల్ హై వే ప్రధాన రహదారి మీద ఎక్కువ గా ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీని పైన నేషనల్ హైవే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రోడ్ ప్రమాదాల పట్ల కాలేజ్ యాజమాన్యం యువత కి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి,జనగాం, వర్దన్నపేట ఏసీపీ లు,మున్సిపల్ కమిషనర్, నేషనల్ హై వే , పంచాయతీ రాజ్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.