బాపూజీ జయంతి వేడుకలలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ 109 వ జయంతి సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆల్విన్ కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయం అని అన్నారు. తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు అని గుర్తుచేశారు. దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి, మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలి, తెలంగాణ త్యాగశీలుల్లో ప్రథమంగా నిలిచే వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. కార్యక్రమంలో యు.బి.డి సూపర్వైజర్ నాగ రాణి, జిల్లా గణేష్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1 అధ్యక్షులు బి.వెంకటేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షులు బిక్షమయ్య, గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, నరసింగరావు, అశోక్, ప్రకాష్, వెంకట్ నరసింహారావు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking