మునుగోడు మండల అధ్యక్షుడిగా జి. వెంకటాచారి
మునుగోడు ,అక్షిత ప్రతినిధి:
సమాచార హక్కు మానవ హక్కు సమితి మునుగోడు మండల అధ్యక్షుడిగా గుంటూరు వెంకటాచారి ని నియమించినట్టుగా ఒక పత్రిక ప్రకటనలో కన్నెగంటి క్రాంతి కుమార్ తెలిపారు ఈ సందర్భంగా మండల పూర్తి కమిటీని ఆయన నియమించారు మండల ఉపాధ్యక్షులుగా బొలుగురి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా సాగర్ల లింగస్వామిని నియమించినట్టుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులు అయిన మండల అధ్యక్షులు జి. వెంకటాచారి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు సంబంధించిన అన్ని సమాచార హక్కు చట్టం ద్వారా వెలికితీస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతానని ఆయన తెలిపారు ఆయన నియామకానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.