కాలనీల సమస్యలు తప్పక పరిష్కరిస్తా
– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
కాప్రా, అక్షిత ప్రతినిది :
తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం కాప్రా డివిజన్ మెహెర్ బాబా కాలనీ లో స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.కాలనీలో నెలకొన్న సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.వాటర్ వర్క్ వాళ్ళతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ రోహిత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, ఇంధ్రయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు