ఉపాధ్యాయ రేషనలైజేషన్ మార్గదర్శకాల్లో మార్పు చేయాలి

ఉపాధ్యాయ రేషనలైజేషన్ మార్గదర్శకాల్లో మార్పు చేయాలి

-పెండింగ్ లో ఉన్న పెన్షన్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి

-నేలకొండపల్లి సర్వసభ్య సమావేశం లో పిఆర్టియు
జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు

ఖమ్మం /అక్షిత బ్యూరో :

పిఆర్టియు నేలకొండపల్లి మండల శాఖ సర్వసభ్య సమావేశం నేలకొండపల్లి రైతు వేదిక లో మండలశాఖ అధ్యక్షులు రత్నకుమార్ అధ్యక్షతన జరిగింది.ముందుగా మండల శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్ సంఘ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులందరు ఏకగ్రీవం గా ఆమోదించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో పాఠశాల విద్యాసంచాలకులు ఈ నెల 20 న జిల్లా కలెక్టర్ లకు విడుదల చేసిన ఉపాధ్యాయ రేషనలైజేషన్ మార్గదర్శకాలు ప్రాధమిక విద్యకు తూట్లు పొడిచేలా ఉన్నాయని తక్షణమే మార్గదర్శకల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు.జి.ఓ 25 ప్రకారం ప్రాధమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు,90 మంది కి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులు కు 7 ఉపాధ్యాయ పోస్టులు ఉండేలా ఉపాధ్యాయ సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం శోచనీయమని వర్క్ ఎడ్జెస్ట్ మెంట్ పేరుతో ఉపాధ్యాయులను ఆందోళనకుగురి చేయ వొద్దని ఖాళీ పోస్టుల్లో వెంటనే డిఎస్సీ నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు.ఎక్కడన్నా విద్యార్థులు సంఖ్య తక్కువ ఉండి ఉపాధ్యాయులు సంఖ్య మరీ ఎక్కువ ఉంటే సర్దుబాటు చేయడాన్ని పిఆర్టియు వ్యతిరేకించడం లేదని అదే క్రమం లో విద్యార్థులకు న్యాయం జరిగేలా నాణ్యమైన విద్య అందేలా విద్యాశాఖ చర్యలు ఉండాలని పేర్కొన్నారు.ఉపాధ్యాయులు దాచుకున్న జిపిఎఫ్ టీఎస్జిఎల్ఐ డబ్బులు నెలలు గడుస్తున్నా విడుదల చేయకపోవడం చివరికి ఉద్యోగ విరమణ చేసిన 6 నెలలకు కూడా పెన్షన్ బిల్లులు మంజూరీకాకపోవడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోందని వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు.సర్వసభ్య సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు కట్టా శేఖర్ రాష్ట్ర బాధ్యులు వేంకటేశ్వర రావు హరిత రమేష్ శ్రీనివాసరావు సురేష్ ఝాన్సీ మంగమ్మ కోమలి శారద ఆనంద రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking