రామన్నపేట జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఎన్నిక

రామన్నపేట జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఎన్నిక

అధ్యక్షులుగా కొండ మల్లేశం గౌడ్

– ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :

రామన్నపేట జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ(464/2024) కమిటీని ఎన్నుకున్నారు. బుదవారం నాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో హౌసింగ్ సొసైటీ కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడుగా కొండ మల్లేశం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్, ఉపాధ్యక్షులు గా ముత్యాల రమేష్, సహాయ కార్యదర్శి గా తెలుసూరి మల్లేశం, కోశాధికారిగా లవణం ఉపేందర్, కమిటీ సభ్యులుగా అప్పం చెన్నకేశ్వర్, మహమ్మద్ గౌస్ లు ఎన్నికయ్యారు. వీరికి సంబందించిన రిజిస్టర్ కాఫీ ను ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి మరియు టీమ్ కి అందజేశారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కమిటీ ఎన్నికలకి సహకరించిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు తెలిపి, జర్నలిస్ట్ లకి ప్రభుత్వం ద్వారా అందే వివిధ రకాల పథకాలు, స్థలాలు, ఇండ్లు, తదితర లబ్దిని అందరికీ అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking