పర్యాటక క్షేత్రంగా
దత్త ఆశ్రమం..
ప్రపంచ ఆధ్యాత్మిక
కేంద్రంగా విలసిల్లాలి
సచ్చిదానంద స్వామి
ఆశీస్సులుండాలి
దుండిగల్ లో దత్త మండపాన్ని
ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడ్చల్, అక్షిత బ్యూరో :
ప్రపంచ పర్యాటక క్షేత్రంగా దత్త ఆశ్రమం వృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆధ్యాత్మిక
కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.దుండిగల్ పురపాలక పరిధి దుండిగల్ విలేజ్ లోని శ్రీశ్రీశ్రీ దత్త సభా మండపాన్ని ప్రారoభించడం ఆనందంగా ఉందని సచ్చిదానంద స్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ముఖ్యమంత్రి రేవంత రెడ్డి అన్నారు.

దుండిగల్ లో నూతనంగా నిర్మించిన దత్త సభా మండపాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒడుదుడుకులు మధ్య గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా మైసూర్ లో జరగాల్సిన దసరా ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభించడం స్వామి ఆశీర్వాదమన్నారు. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ అవదూత శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద ఆశీస్సులతో శ్రీశ్రీ దత్త విజయానంద ఆశీస్సులతో గణపతి సభా మండపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. హిందూ సాంప్రదాయం విలువలు యావత్ ప్రపాంచానికి చాటి చెప్పిన సచ్చిదానంద స్వామీ నిర్ణయం ఎనలేనిదన్నారు. దత్త విజయానంద స్వామి మాట్లాడుతూ పెద్ద అపాయం వచ్చి అగ్నిదేవుడు తాండవించి ఆలయం బూడిదైనా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో దత్త సచ్చిదానంద ఆశీస్సులతో ఆలయాన్ని పునర్నిరించడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి ఎన్ని పనులున్నా ఆలయ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల కృషి ఎనలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో దత్త సచ్చిదానంద స్వామితో పాటు ప్రభుత్వ సలహాదారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.