అధికారుల నిర్లక్ష్యం
పిల్లలకు ప్రాణ సంకటం
దుండిగల్ పురపాలక అధికారుల తీరిది…
బౌరంపేటలో వీధికుక్కల బారిన పడిన సెకండ్ విద్యార్థి..
కమిషనర్ కు సమాచారం అందిన వెంటనే బ్లూ క్లాస్ సొసైటీని.. పిలిపించి ఏరియాలో ఉన్నటువంటి కుక్కలను పట్టివేత…
సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే బ్లూ క్రాస్ సొసైటీ పేరుతో హడావిడి…
ప్రజల విమర్శలు వెల్లువ
మేడ్చల్, అక్షిత బ్యూరో :
అధికారుల నిర్లక్ష్యానికి పిల్లలకు ప్రాణ సంకటంగా పరిణమించింది. వీధి కుక్కల దాడికి పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఒకరిని కుక్కలు దాడి చేయగా తాజాగా మరో చిన్నారిని దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే… దుండిగల్ పురపాలక అధికారుల నిర్లక్ష్యం పిల్లలకు ప్రాణ సంకటంగా మారింది. సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే బ్లూ క్రాస్ సొసైటీ పేరుతో హడావిడి చేసే మున్సిపల్ అధికారులు ఆపై అటువైపు చూడక పోవడంతోనే వరుస సంఘటనలు జరుగుతున్నాయి.

దుండిగల్, గాగిల్లపూర్, మల్లంపేటలో జరిగిన సంఘటనలు మరువకముందే బౌరంపేటలో ఇంగ్లీషు స్కాలర్స్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి జస్వంత్ కిరణం షాప్ కు వెళుతుండగా వీధి కుక్కలు వెంటపడి తరమగా తొడకు భారీగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా సూరారంలోని నారాయణ మాల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
దుండిగల్ లో వరుస సంఘటనలు
దుండుగల్ మున్సిపాలిటీలో వీధు కుక్కల ద్వారా వరుస సంఘటనలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.దుండిగల్ గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనలో ముగ్గురు పిల్లలు వీధికుక్కల బారిన పడ్డారు. మల్లంపేటలో రెండేళ్ల చిన్నారిని వీధికుక్కల ఈడ్చుకెళ్లి గాయపరిచిన సంఘటన అందరిని కలచివేసింది,బౌరంపేట లో బుధవారం ఇంగ్లీషు స్కాలర్స్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి జస్వంత్ ఉదయం కిరాణా షాప్ కు వెళుతుండగా వీధికుక్కల వెంటపడి గాయపరచడంతో తొడకు బలమైన గాయాలు అయ్యాయి. మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు, సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మున్సిపల్ అధికారులు హడావిడి చేస్తుండడం ఆపై గాలికి వదిలేయడంతో మున్సిపల్ అధికారుల తీరుపై
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమాచారం అందిన వెంటనే స్పందించిన కమిషనర్..
బౌరంపేటలో విది కుక్కల బాలుడుపై దాడి చేయడంతో స్థానిక బిజెపి నాయకులు పిసరీ కృష్ణారెడ్డి కమిషనర్ కు సమాచార అందించడంతో వెంటనే బ్లూ కాస్ట్ సొసైటీ వారిని పిలిపించి ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని కుక్కలు దగ్గరుండి పట్టించారు అని ముఖ్యంగా చిన్నపిల్లలు తిరగని ప్లేస్ లలో వాటికి ఆహారము మంచినీళ్లు ఇవ్వాలని సూచించారు ప్రస్తుతము అన్ని స్కూళ్లలో పిల్లలకు వీదిక్కుల పైన అవగాహన కార్యక్రమాలు చేర్పడతామని కమిషనర్ తెలిపారు.