గవర్నమెంట్ ప్లీడర్లుగా ఎం.శ్రీధర్ గౌడ్, జి.వెంకట్ రెడ్డి

గవర్నమెంట్ ప్లీడర్లుగా
ఎం.శ్రీధర్ గౌడ్, జి.వెంకట్ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణ సీనియర్ సివిల్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్  సివిల్ కోర్టుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుగా స్థానిక న్యాయవాదులు ఎం.శ్రీధర్ గౌడ్,జి.వెంకట్ రెడ్డిలను నియమిస్తూ రాష్ట్ర న్యాయ, చట్ట, శాసనసభ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి ఆర్. తిరుపతి జిఓ ఆర్జీలను ఈ నెల 9న జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాలపరిమితి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా కోర్టులకు సంబంధించి భూ సేకరణయేతర ప్రభుత్వ సివిల్ కేసులను వెంకట్ రెడ్డి, భూసేకరణ కేసులను శ్రీధర్ గౌడ్ 3 సంవత్సరాల వరకు వాదిస్తారని పేర్కొన్నారు.

ఎంఎ, ఎల్ఎల్ ఎం చేసిన వెంకట్ రెడ్డి 2002లో మిర్యాలగూడ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా నమోదు చేసుకుని స్థానిక కోర్టుల్లో ప్రాక్టీసు ప్రారంభించారు. అదేవిధంగా శ్రీధర్ గౌడ్ రెండో సారి ఎజిపిగా నియమితులయ్యారు. వారి నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking