ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేపట్టాలి…!
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకటేష్…!!
జనగామ, అక్షిత ప్రతినిధి:
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాల్లోనే (వడ్లను) ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులకు ఇచ్చి మోసపోవద్దన్నారు…ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్వేత వెంకన్న అన్నారు… బచ్చన్నపేట మండలం కోడవటూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం

కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ… ఇచ్చిన మాట మీద నిలబడి రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు.రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2320, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2300, సన్న ధాన్యముకు 2800 రేటును నిర్ణయించిందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, మాసాపేట రవీందర్ రెడ్డి, ఎండి మసూద్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, మట్టి బాలరాజు,నీల రమేష్ ,తిరుపతిరెడ్డి, మైపాల్ రెడ్డి, యువ నాయకుడు ఎద్దు హరీష్, గాలి కృష్ణ, పలువురు నాయకులు, అధికారులు ఏపీఎం నాగేశ్వరరావు, సీసీలు సత్యనారాయణ, నరసింహులు, కందుకూరి లక్ష్మి, తిరువలమ్మ, వివో ఏ గంగం వాణి, కొడవటూరు గ్రామ ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, పలు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.