రైతులకు ఇబ్బందులు తలెతొద్దు

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి…!

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…!!
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి…!!!

జనగామ, అక్షిత ప్రతినిధి:

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం… తరిగొప్పుల మండలం అబ్దుల్ నగరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం… నర్మెట మండలం బొమ్మకూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి…మండలంలోని వడ్లకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి… మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking