పేద కుటుంబంలో వికసించిన సౌజన్య…

పేద కుటుంబంలో వికసించిన సౌజన్య…

జనగామ, అక్షిత ప్రతినిధి:

పేద కుటుంబంలోవికసించిన కుసుమం తేలుకంటి సౌజన్య…ఆని గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీ జిల్లా నాయకులు కొమురెల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని అలింపూర్ గ్రామ తోటి ఉద్యోగి కారోబార్ మురళి చిన్న కుమార్తె 2024 డీఎస్సీలో నెల రోజులు ఇంట్లోనే చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా, జాబ్ సాధించినందుకు గాను ఆమెను తండ్రి మురళిని ఘనంగా శాలువాతో సన్మానం చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… కారోబార్ గా తక్కువ వేతనమ్ తో కుటుంబాన్ని వెళ్ళదీస్తూ ముగ్గురు కుమార్తె. ఒక కుమారుడిని చదివించి పలువురికి ఆదర్శoగా నిలిచారాని అన్నారు. స్పెషల్ ఏడ్యూకేషన్ లో ఎస్ జి టి ఉద్యోగం పొందిన సౌజన్య గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు.

జనగామ జిల్లాలోనే 4 వ ర్యాంకు సాధించి అటు ఉరుకు. ఇటు తల్లి తండ్రులకు మంచి పేరు తెచ్చిందాన్నారు. చదువుకు. ఉద్యోగానికి పేదరికం అడ్డురాడని నిరూపించిందన్నారు.. కార్యక్రమం లో కారోబార్లు కొండ లలిత, గొల్లపల్లి బాబూగౌడ్, ముక్క నాగయ్య, గుజ్జుక శ్రీనివాస్, వనం చంద్ర శేఖర్, కాళ్ళ ప్రభాకర్, టేకులపల్లి రాజు, శ్రీనివాస్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking