బచ్చన్నపేట మండలంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్వేతా వెంకట్ చారి…
పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్….
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని… చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి, బచ్చన్నపేట పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ లు అన్నారు. ఆదివారం రోజున జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని, ఇటికాల పల్లె, రామచంద్ర గూడెం, కొన్నే, పడమటి కేశవాపూర్, నాగిరెడ్డిపల్లె, గంగాపూర్…గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్వేత వెంకట చారి, పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్లు మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర అందిస్తూ ఏ గ్రేడ్ కు 2320, బి గ్రేడ్ కు 2300 ,సన్న రకం వడ్లకు 2800 ప్రభుత్వం నిర్ణయించిందని, దళారులకు వడ్లు అమ్మవద్దని, కొనుగోలు సెంటర్ లో వడ్లు అమ్ముకోవాలని, 48 గంటలలో డబ్బులు అకౌంట్ లో పడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోసపేట రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ సీఈవో బాలస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటివిద్యనాథ్, ఆముదాల మల్లారెడ్డి, ఎండి మసూద్, అల్వాల ఎల్లయ్య, నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఎద్దు హరీష్, నీల రమేష్, బైరగోని కనకయ్య గౌడ్, నేరెళ్ల రాజయ్య, నర్మెట అంజి గౌడ్, నర్మెట్ట చంద్రమౌళి, వేముల వెంకట్ గౌడ్, గుత్తి సిద్ధిరాములు, వేముల లక్ష్మణ్ గౌడ్, వంచ వెంకట్ రెడ్డి, బడుకోల్ శ్రీనివాసరెడ్డి, చల్లా సంతోష్ రెడ్డి, సంజీవరెడ్డి, అరగొండ పరుశురాములు, కుక్కల రాములు, తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లేష్, ఇంద్రయ్య, మాజీ సర్పంచ్ వీరారెడ్డి, కొనుగోలు కమిటీ నిర్వాహకులు, పలు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.