బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో ధర్నా రాస్తారోకో…
రైతులకు రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్….
జనగామ, అక్షిత ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు వెయ్యకుండా రైతుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ…. బి.ఆర్.యెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం జనగాం నియెజికవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అదేశాలనుసరం…. బచ్చన్నపేట మండలం లో ప్రధాన చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి రైతలకు వెంటనే రైతు బంధు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ధర్నా నిర్వహిస్తున్న టిఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇట్టి కార్యక్రమంలో బచ్చన్నపేట మండల, పట్టణ, బి.ఆర్.యెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, బి.ఆర్.యెస్ పార్టీ అనుబంధాల సంఘాల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.